ఆంధ్ర ప్రదేశ్
MLA కొలికపూడి శ్రీనివాస్ ఎపిసోడ్‌పై హైకమాండ్ నజర్

Kolikapudi Srinivas Rao: MLA కొలికపూడి శ్రీనివాస్ ఎపిసోడ్‌పై హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీకే అల్టిమేటం జారీ చేయడాన్ని టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. పది నెలలుగా తిరువూరులో చోటుచేసుకున్న ఘటనలు క్షేత్రస్థాయి పరిస్ధితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ముగ్గురు సభ్యుల కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది.
కమిటీలో జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ ఎంపీ చిన్ని, పార్టీ సమన్వయకర్త మంతెన సత్యనారాయణరాజు ఉన్నారు. ముఖ్యంగా 48గంటల్లో ఏఎంసీ మాజీ ఛైర్మన్ రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కొలికపూడి పార్టీకే అల్టీమేటం జారీ చేయడంతో హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది.