ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు

రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీని ప్రపంచస్థాయి ఉన్నత ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేలా అధికారులు పనిచేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టుగా పోలవరం అని అన్నారు.