Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్

Tirumala: తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్‌వీఎం3–ఎం5 ఉపగ్రహన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్‌కు, రాకెట్ నమూనాకు, ఇస్రో శాస్త్రవేత్తలకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.
ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ ను పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎల్‌వీఎం3–ఎం5ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. అత్యంత బరువైన బాహుబలి రాకెట్ కమ్యూనికేషన్ శాటిలైట్‌గా భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశామని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు.



