తెలంగాణ
Eatala Rajendar: అధికారం శాశ్వతం కాదు.. నేలపైకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించండి

Eatala Rajendar: సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైరయ్యారు. సీఎం వసూళ్లను పక్కనపెట్టి ప్రజల గురించి పట్టించుకోవాలని ఈటల రాజేందర్ కోరారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలన్నారు. అధికారం శాశ్వతం కాదు..నేలపైకి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. చేతికి రావాల్సిన పంట నీళ్లపాలైందన్నారు.
ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతుంటే..తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. అంతర్గత కుమ్ములాటలు పక్కనపెట్టి.. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు.



