ఆంధ్ర ప్రదేశ్
విశాఖ అయోధ్య సెట్ వేసి భారీ మోసాలు

విశాఖపట్నం బీచ్ రోడ్డులో అయోధ్య రామాలయం సెట్ వేసి భక్తి ముసుగులో మోసాలు చేస్తున్న వారి గుట్టు రట్టయింది. భద్రాచలం స్వామివారి పేరిట భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేశారు. దర్శనం పేరుతో నిర్వాహకులు కోట్లు రూపాయాలు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాముల వారి కళ్యాణోత్సం పేరుతో భక్తుల నుంచి 3 వేల రూపాయాలు వసూల్ చేసినట్లు బాధితులు తెలిపారు. భక్తి ముసుగులో దోపిడీకి పాల్పడిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఓ బాధితుడు డిమాండ్ చేస్తున్నారు.



