ఆంధ్ర ప్రదేశ్

Vidadala Rajini: విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారా?

Vidadala Rajini: సీఎం చంద్రబాబుపై విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు చేసినవి అనుచిత వ్యాఖ్యలేనని మాజీ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారా? అంటూ మండిపడ్డారు. ప్లాంట్‌ నిర్వహణ చంద్రబాబుకు భారంగా మారిందని, అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉరేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు మైండ్‌ సెట్‌ ఎప్పుడూ ప్రైవేటీకరణే అని విషయం మరోసారి రుజువైందన్నారు. వైఎస్ జగన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటూ వచ్చారు. కేంద్రానికి లేఖలు రాయటమే కాదు, సభల్లో కూడా ప్రధాని మోదీని నేరుగా అడిగారు. ప్లాంటు బాగు కోసం జగన్ అన్ని ప్రయత్నాలూ చేశారని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button