సినిమా
Allu Arjun: అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ వైరల్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తన పాత సిగ్నేచర్ స్టైల్‌కు తిరిగి వచ్చాడు. తాజా ఫొటోలు చూసిన అభిమానులు ‘వింటేజ్ బన్నీ తిరిగొచ్చాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘అల వైకుంఠపురములో’ తర్వాత రఫ్ అవతారంలోనే కనిపిస్తూ వచ్చిన అల్లు అర్జున్ మళ్లీ తన పాత స్టైలిష్ లుక్‌కు తిరిగి వచ్చాడు. రేస్ గుర్రం, జులై రోజుల్ని గుర్తుచేసే హెయిర్ స్టైల్, కూల్ అటైర్‌తో కనిపించిన బన్నీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో ప్రియదర్శి నేతృత్వంలోని కోర్ట్ మూవీ టీమ్‌ను కలిసిన సందర్భంగా ఈ ఫొటోలు విడుదలయ్యాయి.
వీటిని చూసిన అభిమానులు “‘వింటేజ్ బన్నీ తిరిగొచ్చాడు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కాంబినేషన్ ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద హిట్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



