తెలంగాణ
యాదగిరిగుట్ట లో స్వాతి నక్షత్ర పూజలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. నేడు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కలశాలలోని వివిధ ఫల రసాలు, పంచామృతాలు ఫల జలములు, శుద్ధ జలంతో శ్రీ స్వామి, అమ్మవార్లను అభిషేకించారు.
అంత ముందు నేడు స్వామి వారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు ,స్థానికులు ఉదయాన్నే స్వామివారి గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ప్రధాన ఆచార్యులు, వేద పండితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యధావిధిగా నిర్వహించారు.



