ఆంధ్ర ప్రదేశ్
డీ లిమిటేషన్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు

ఏపీ పునర్ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏపీ పునర్ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 ఉన్న సీట్ల సంఖ్య 153కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 175 నుంచి 225 వరకు పెరగాల్సి ఉంటుంది.
విభజన చట్టం ప్రకారం పాలన సాఫీగా సాగేందుకు ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోరారు. అయితే త్వరలో 2026లో జరిగే జనగణన ఆధారంగా డీ లిమిటేషన్ ఉంటుందని, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం లేదని సుప్రీం అభిప్రాయపడింది.