జాతియం
Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్

Gyanesh Kumar: భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన ఇవాళ సీఈసీగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్ పోల్ ప్యానెల్ అధిపతిగా నియమితులయ్యారు.
అయితే ఆయన నియామ కాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సీఈసీ పేరు ప్రకటించడమేంటి? అని నిలదీసింది. జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవాళ విచారణకు రానున్నాయి.