తెలంగాణ
KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు బయల్దేరిన కేసీఆర్

KCR: ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి కేసీఆర్ బయల్దేరారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఉదయం 11గంటల 30నిమిషాలకి బీఆర్కే భవన్‌కు చేరుకోనున్నారు కేసీఆర్. బీఆర్కే భవన్‌లోనే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్‌ను విచారించనుంది.
కేసీఆర్‌తోపాటు బీఆర్కే భవన్ లోపలికి తొమ్మిది మంది నేతలకు అనుమతి ఇచ్చారు. కేసీఆర్‌తోపాటు బీఆర్కే భవన్‌లోని హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావుగౌడ్‌తోపాటు మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లనున్నారు.