తెలంగాణ
Sunitha Laxma Reddy: స్పీకర్ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి

Sunitha Laxma Reddy: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై నిన్న సభలో స్పీకర్ మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. పద్దులపై చర్చ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతుంటే నాకే వినాలనిపిస్తలేదు వాళ్లు ఎలా నచ్చుతుందని స్పీకర్ మైక్ కట్ చేశారు.
స్పీకర్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తప్పు బట్టారు. నాకు ప్రజలు అవకాశమిస్తే అసెంబ్లీకి వచ్చానని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలనే అసెంబ్లీలో ప్రస్తావించానని అన్నారు. నిన్నటి నా ప్రసంగంలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు లేవన్నారు. స్పీకర్ వ్యాఖ్యలను చాలా బాధ కలిగించాయని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.