జాతియం
Bihar: బాయ్ ఫ్రెండ్ కోసం గొడవ.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు

Bihar: స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థినులు తమ బాయ్ ఫ్రెండ్ కోసం రోడ్డుపైనే జుట్టు పట్టుకుని గొడవ పడ్డారు. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలోని గులాబ్బాగ్ హాన్స్దా రోడ్ సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే అబ్బాయిని ఇద్దరు విద్యార్థినులు ఇష్టపడ్డారు. ఈ విషయం వారికి తెలియటంతో ఇద్దరూ ముందుగా వాగ్వాదానికి దిగారు.
ఇది కాస్తా కొంతసేపటికి హింసాత్మకంగా మారింది.. ఈ ఇద్దరు విద్యార్థినులతో పాటు తమ తోటి స్నేహితులు కూడా గొడవకు దిగి విపరీతంగా కొట్టుకున్నారు. ఇది చూసిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థినులను శాంతింపజేసి, పంపించేశారు. ఇదంతా రోడ్డుపై బహిరంగంగా జరగడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్ అవుతోంది.