అంతర్జాతీయం
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది భారతీయులు మృతి

Saudi Arabia: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారత యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో భారీ పేలుడు మరియు మంటలు చెలరేగి, బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. విషాదకరంగా ఎవరికీ బయటపడే అవకాశం లేక, మహిళలు, చిన్నారులు సహా అందరూ సజీవదహనమయ్యారు.
మరణించిన వారిలో చాలామంది హైదరాబాద్‌కు చెందినవారని సమాచారం. యాత్రికులు మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనా వైపు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు రక్షణ చర్యలు ప్రారంభించి, మృతుల వివరాలు గుర్తించే పనిలో ఉన్నారు. ఈ సంఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.



