వ్యాపారం
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 345 పాయింట్లు నష్టంతో 23వేల 85 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1050 పాయింట్ల నష్టంతో 76వేల 330 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్‌లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు ఈ ఒడిదొడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ల పరిణామాలు దేశీయ మార్కెట్‌లపై ప్రభావం చూపుతున్నాయి. బాండ్ ఈల్డ్‌లు భారీగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిస్టానికిలను చేరుతోంది.