Srinivas Guptha: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది

Srinivas Guptha: క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. నాచారంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థాయి బ్యాట్మెంటన్ పోటీలు బ్యాడ్మింటన్ కోచ్ హర్ష ఆధ్వర్యంలో నిర్వహించారు.
మూడు రోజులపాటు నిర్వహించిన పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా విజేతలకు మెడల్స్ అందించారు. క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని శ్రీనివాస్ గుప్త తెలిపారు.
అన్ని వయసుల వారికి వర్గాల వారికి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వము క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. జిల్లా స్థాయి లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి అక్కడి నుంచి జాతీయస్థాయిలో ఆడే విధంగా ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం ఉంటుందన్నారు. అలాగే ఈ నెల 26, 27న రెండు రోజుల పాటు తార్నాక ఆర్ఆర్సిలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కోచ్ హర్ష తెలిపారు.