తెలంగాణ
ఆపరేషన్ విజయవంతం కోసం ప్రత్యేక పూజలు

ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశం అన్ని రంగాల్లో రాణించి శత్రు సేనలను తుద మొట్టించాలని కోరుతున్నారు ప్రజలు. మృత్యుంజయ మహామంత్రాలతో కార్యక్రమం నిర్వహించినట్లు వేద పండితులు జ్యోతిష్చంద్ర శర్మ తెలిపారు.
ఆలయ ఈవో శ్రీనివాస శర్మ నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేద పండితులు శంభు హోమం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశంతో ఆలయాల్లో దైవభక్తితో పాటు, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేద పండితులు వెల్లడించారు.