Vishwambhara: ‘విశ్వంభర’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా స్పెషల్ అప్డేట్ వచ్చేసింది. మరి, ఆ విశేషాలు ఏంటో చూద్దాం!
చిరంజీవి, త్రిష జోడీతో వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ నుంచి త్రిష పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో త్రిష ‘అవని’ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పోస్టర్లో త్రిష లుక్ విజువల్ ట్రీట్‌గా ఆకట్టుకుంటోంది.
సృష్టి, స్థితి, లయ నేపథ్యంలో సాగే ఈ సినిమా, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లోని వినోదం, ‘హిట్లర్’లోని సెంటిమెంట్‌ను మిళితం చేస్తుందని సమాచారం. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.