తెలంగాణ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతోన్న ఆమెను హుటాహుటిన సర్ గంగారామ్ హాస్పిటల్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని, వైద్యుల పర్యవేక్షణంలో ఆమె కోలుకుంటున్నారని తెలిసింది. అయితే ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యం వల్లే సోనియా అస్వస్థతకు గురై ఉండవచ్చని తెలుస్తోంది.
గత కొద్ది నెలలుగా ఢిల్లీ ప్రజలు గాలి కాలుష్యంతో అనారోగ్యానికి గురవ్వుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి సానుకూల ఫలితం కనిపించడం లేదు. ప్రజలు ఊపిరి పీల్చుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు సెలవులు కూడా ప్రకటించాయి.



