తెలంగాణ
Hyderabad: కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం, జాబ్ పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రెండ్రోజులుగా కన్పించకపోవడంతో హాస్టల్ గది వద్దకు వెళ్లారు సిబ్బంది. అయితే మహేందర్ ఉరివేసుకొని ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహేందర్ జేబులో సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.