ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న గాయని మంగ్లీ

శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు గాయని మంగ్లీ. మళ్లీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందన్నారు మంగ్లీ. తొలిసారిగా సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించినప్పటికీ.. ప్రపంచంలోనే ఏకైక దేవాలయమైన సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారిని దర్శించుకోగానే తనకు తెలియకుండానే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. స్వామి వారిపై మంగ్లీ అన్నమయ్య కీర్తన ఆలపించారు.