ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన భూమన కరుణాకర్ రెడ్డి

వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మృతి కేసులో సంచలన ఆరోపణలు చేసిన భూమున కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతి ఎస్వీయూ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
గోవుల మృతి ఆరోపణలకు ఆధారాలు చూపాలని టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమనకు ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు.



