వ్యాపారం
Silver Rate: రికార్డ్ స్థాయికి చేరిన వెండి ధర.. ఈ ఒక్క రోజే ఎంత పెరిగిందంటే?

Silver Rate: వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వారం రోజులుగా వెండి ధర పసిడితో పోటీ పడుతోంది. నిన్న ఒక్కరోజే కిలో వెండి ధర 19 వేల రూపాయలకు పెరిగింది. ఇది ఓ రికార్డ్. ప్రస్తుతం కిలో వెండి ధర రెండు లక్షల 44 వేల 500 రూపాయలు ఉంది.
ఇది అతికొద్ది రోజుల్లో మూడు లక్షలకు చేరుకుంటుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇతర రంగాల్లో పెట్టుబడుల కంటే బంగారం, వెండిపై ఇన్వెస్ట్‌మెంట్స్ మేలని భావిస్తుండంతో మెటల్స్ రేట్లు పెరిగిపోతున్నాయని నిపుణలు చెబుతున్నారు.



