సినిమా

Shruti Haasan: తన ప్లాప్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన శృతి హాసన్!

Shruti Haasan: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తన పాత సినిమా ‘3’ గురించి మాట్లాడుతూ, మరిన్ని ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ఆ ముచ్చట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం!

రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ సత్యరాజ్ కుమార్తె పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని శృతి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే, తన పాత చిత్రం ‘3’ గురించి మాట్లాడుతూ, 2012లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ఇప్పుడు విడుదలైతే భారీ విజయం సాధిస్తుందని శృతి ధీమా వ్యక్తం చేశారు.

‘3’ సినిమా లవ్, ఎమోషన్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కథ, సంగీతం ఈ జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతాయని శృతి చెప్పారు. ‘కూలీ’లో శృతి పాత్ర గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button