అంతర్జాతీయం

Sweden: స్వీడన్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

Sweden: స్వీడన్‌లో కాల్పులు కలకలం రేగింది. ఒరెబ్రో సిటిలోని అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్‌పై కాల్పులు జరిగాయి. నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుల్లో కాల్పులకు తెగబడిన వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే అతడొక్కడే ఈ దారుణానికి పాల్పడినట్లుగా భావించడం లేదని పోలీసులు తెలిపారు. దుండగుడిని గుర్తించాల్సి ఉందన్నారు. కాగా.. గాయాలతో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను పోలీసులు వెల్లడించలేదు. దారుణానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతానికైతే ఉగ్ర లింకులున్నట్లు చెప్పలేమన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button