ఆంధ్ర ప్రదేశ్
AP: బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి

AP: పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందింది. నరసరావుపేటకి చెందిన చిన్నారికి ఇటీవల బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. దీంతో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కి తరలించారు. అయితే ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గతనెల 15న చిన్నారి మృతి చెందింది. చిన్నారి రక్త నమూనాలు పరీక్షించగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. ఇక బర్డ్ ఫ్లూ సోకడంతో జిల్లా వైద్య బృందం అలర్ట్ అయ్యింది.
నేడు నరసరావుపేటకు జిల్లా వైద్య అధికారులు రానున్నారు. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు, అలాగే చుట్టు పక్కల వారి రక్త నమూనాలు సేకరించనున్నారు డాక్టర్లు. మరో వైపు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బాధితుల్ని పరామర్శించారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచాలని సంబంధింత అధికారులకు సూచించారు.