Shambhala: ఆకట్టుకుంటున్న ఆది సాయి కుమార్ ‘శంబాల’ టీజర్!

Shambhala: యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’ సినిమా టీజర్ విడుదలైంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం కొత్త కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ కొత్త సినిమా ‘శంబాల’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దర్శకుడు యుగంధర్ ముని రూపొందించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ టీజర్ తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. “సైన్స్‌కు అందని ప్రశ్నలకు సమాధానం దొరికితే దాని గొప్పతనం ఏమిటి?” అనే ఆసక్తికర డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది.
ఒక ఊరిపై ఉల్క ప్రభావం, అనూహ్య మార్పులు, దాన్ని ఎదుర్కొనే ఆది పాత్ర టీజర్లో ఆకట్టుకుంటుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం సినిమాకు బలం. సినిమాటోగ్రఫీ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్‌లో మరింత శ్రద్ధ అవసరం. షైనింగ్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆది ఈ సినిమాతో హిట్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.