అంతర్జాతీయం

ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి సంచలన అప్‌డేట్!

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా‘స్పిరిట్’ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ పవర్‌ఫుల్ కాప్ డ్రామాలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ తమిళ హీరోని ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఈ పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలవనుందట. ఇప్పటికే త్రిప్తి దిమ్రి ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయం తెలిసిందే.

సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే పాటల కంపోజింగ్ పనులను ప్రారంభించారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌లపై భారీ స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. సందీప్ రెడ్డి వంగా మరోసారి వినూత్న కథాంశంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్, రిలీజ్ డేట్‌పై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button