తెలంగాణ
Danam: నాపై 173 కేసులున్నాయి.. పోతే జైలుకు పోతా

Danam: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గబోనన్నారు. ఖైరతాబాద్‌లో మిషన్ పెడితే ఊరుకోనని సంబంధిత అధికారుల ను హెచ్చరించారు. అయితే తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్న దానం.. ఇప్పటికే తనపై 173 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోతే అందులో జైలుకుపోతానంటూ హాట్ కామెంట్స్ చే శారు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన దానం.. వైఎస్ హయాంలో కూడా తను కాంప్రమైజ్ కాలేదని చెప్పారు.
ఇక తన ఇంట్లో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరి ఫోటోలు ఉంటాయని చెప్పారం దానం నాగేందర్. అయినా ఇష్టమైన నేతల ఫోటోలు ఉంటే తప్పేంటని క్వశ్చన్ చేశారు. మహిపాల్ రెడ్డి లాగా ఒక్క ఫోటో పెట్టుకోలేదని కౌంటర్ అటాక్ చేశారు. ఇక పేదళ ఇళ్లు కూల్చుతామంటే అస్సలు ఊరుకోనన్న దానం.. హైడ్రా విషయంలో ఎప్పటికీ తగ్గబోనన్నారు.