Pakistan: మరోసారి వక్ర బుద్ధిని బయటపెట్టిన పాకిస్తాన్.. హైజాకర్లను కాపాడేందుకు ఏకంగా చట్టసవరణ!

Pakistan: పాకిస్థాన్ అనేగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగ్రవాదులే. ఆ దేశం టెర్రరిస్టులకు నిలయం. అక్కడ అనేకమంది ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. అక్కడే ఉగ్రవాదుల్ని తయారు చేస్తారు. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. మతం పేరు చెప్పి అమాయకుల ప్రాణాలను ఎలా బలితీసుకోవాలో నేర్పిస్తారు. అక్కడ ఎన్నో ఉగ్రవాద శిబిరాలు పని చేస్తున్నాయి. వారంతా భారత్ పై ఉగ్రదాడులు చేయడంలో నిత్యం నిమగ్నమై ఉంటారు. ఇక అక్కడ మత కల్లోలాలు కోకొల్లలు. అలాంటి పాపిస్తాన్.. ఇప్పుడు మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఇంతకీ షరీఫ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి..?
ఉగ్రమూకలను పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ ఇప్పుడు మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణశిక్షను రద్దు చేసింది. ఈ మేరకు ఏకంగా చట్టంలో సవరణలు చేసింది. దీనికి సంబంధించిన బిల్లుకు పాక్ సెనెట్ తాజాగా ఆమోదముద్ర వేశారు. ప్రపంచం మొత్తం పాక్ చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు. ఇది ఒక్క పాకిస్థాన్ కు మాత్రమే సాధ్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
పాక్ పీనల్ కోడ్ చట్టాల ప్రకారం.. హైజాకింగ్‌కు పాల్పడిన వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కల్పిస్తే గరిష్ఠంగా మరణశిక్ష ఎదుర్కొంటారు. ఇక, బహిరంగంగా మహిళపై బలప్రయోగం చేసి ఆమెను వివస్త్రను చేస్తే గతంలో ఏడేళ్ల జైలు శిక్ష ఉండేది. 1983లో జనరల్ జియా ఉల్‌హక్ పాలనలో దాన్ని మరణశిక్షగా మార్చారు. అయితే.. ఈతరహా నేరాల్లో శిక్షను తగ్గించాలని పాకిస్థాన్‌లో కొంతకాలంగా డిమాండ్లు మొదలయ్యాయి.
ఈక్రమంలోనే తాజాగా క్రిమినల్ చట్ట సవరణ బిల్లు 2025ను తీసుకొచ్చారు. అందులో హైజాకర్లకు ఆశ్రయం కల్పించడం, మహిళలను బహిరంగంగా వివస్త్రను చేయడం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి శిక్షలను తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఇందుకు పాక్ సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ నేరాలకు మరణశిక్షలను తొలగించి.. దాని స్థానంలో దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేసింది.అత్యంత తీవ్రమైన నేరాల్లో మాత్రమే మరణశిక్ష విధించేలా సవరణ బిల్లును రూపొందించింది. త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా పాక్ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.
నిర్దిష్టంగా కొన్ని తీవ్రమైన నేరాలకు మాత్రమే ఇకపై మరణ శిక్ష ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. మిగిలిన కేసుల్లో యావజ్జీవ శిక్షే గరిష్టంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ నిర్ణయంపై పాక్ రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు.
మరోవైపు.. ఈ పరిణామాలపై చైనా సానుకూలంగా స్పందించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని తాం వ్యతిరేకిస్తామని అన్నారు.. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని అన్నారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలి అని చైనా పిలుపునిచ్చింది.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంటోంది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో ఇది మరోసారి బహిర్గతమైంది. భారత్‌లో పలు మారణహోమాలకు కారణమైన లష్కరే తొయ్యిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర ముఠాలు పాక్ గడ్డ నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లష్కరే అధినేతను జైల్లో పెట్టామని దాయాది చెబుతున్నప్పటికీ.. అతడికి అక్కడ రాచమర్యాదలు అందుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇక, జైషే చీఫ్ మసూద్ అజార్‌కు స్వయంగా పాక్ ప్రభుత్వమే పటిష్ట భద్రతను కల్పిస్తున్నట్లు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి.
సోషల్ మీడియాలో ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగుతుంది. కొంతమంది నేటిజన్లు.. మహిళలను వివస్త్రలను చేసే నేరాన్ని హత్యతో సమానమైన తీవ్రవైన నేరంగా అభివర్ణిస్తున్నారు. అలాంటి వాటికి మరణశిక్షను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరణ శిక్ష తగ్గించడం వల్ల నేరగాళ్లలో భయం తగ్గుతుందని… నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే… దేశ న్యాయ శాఖ మంత్రి ఈ అభ్యంతరాలను తోసి పుచ్చారు. శిక్షల తీవ్రత ద్వారా మాత్రమే నేరాలు తగ్గుతాయన్నవాదనను ఆయన అంగీకరించలేదు.
యూరప్‌ను ఉదాహరణగా చూపుతూ… అక్కడ మరణశిక్ష లేనప్పటికీ నేరాల రేటు తక్కువగా ఉందని ఆయన గుర్తు చేశారు. శిక్షలు కఠినంగా ఉండటం ముఖ్యం కాదని.. నేరాలను సమర్థవంతంగా నిరోధించడానికి న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉండటమే ప్రధానమని ఆయన వాదించారు. ఈ క్రిమినల్ చట్టాల సవరణ బిల్లుతో పాటు సెనెట్ పలు ఇతర కీలక బిల్లులైన ఎక్స్‌ట్రాడిషన్ సవరణ బిల్లు, పాకిస్తాన్ పౌరసత్వ చట్టం సవరణ బిల్లులకు కూడా ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణలు పాకిస్తాన్ న్యాయవ్యవస్థలో గణనీయమైన మార్పులకు నాంది పలికాయి.
మొత్తానికి ఉగ్రవాదులపై పాక్ ప్రభుత్వ దృష్టికోణం ప్రపంచానికి మరోసారి బహిర్గతమైంది. శిక్షలను తగ్గిస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు పాక్ ఉగ్రవాదంపై ఉన్న ప్రమేయాన్ని పటాపంచలు చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.