తెలంగాణ
Yadadri: భర్తను హత్య చేయించిన భార్య

యాదాద్రి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సుపారీ గ్యాంగ్‌తో భర్తను కట్టుకున్న భార్యే హత్యచేయించింది. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఘటన జరిగింది. ఈ ఘటన మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు విచారణ చేపట్టారు. అసలు విషయం బయటపడడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు స్వామి భార్య, బావమరిదితో పాటు సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.