తెలంగాణ
Selfie Suicide: నాచారంలో యువతి ఆత్మహత్య..

Selfie Suicide: హైదరాబాద్ నాచారంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. హెచ్ఎంటీ నగర్ సరస్వతి కాలనీలో దీప్తి అనే యువతి సెల్ఫీ సూసైడ్ చేసుకుంది. దీప్తి తార్నాకలోని ఐఐసీటీలో పరిశోధక విద్యార్ధిని. ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. దీప్తి తండ్రి సంగీతరావు.. అనిల్ అనే వ్యక్తి దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకున్నాడు.
ఉద్యోగం ఇప్పించకపోగా.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని.. సంగీతరావు, దీప్తిపై కేసు నమోదు చేశారు. దీంతో తన తండ్రితో దూరంగా ఉన్నా.. తన ప్రమేయం లేకున్నా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఇంట్లోనే సెల్ఫీ వీడియో తీసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.