తెలంగాణ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపారు. 5 వేల 749 ఎంపీటీసీ స్థానాలు, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.



