సినిమా
DD Next level: వివాదంలో డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా సాంగ్

DD Next level: తమిళ నటుడు సంతానం నటించిన సినిమాలో గోవింద నామాలతో పాట రూపొందించారు. డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్ సినిమాలో గోవింద నామాలను ర్యాప్ సాంగ్ గా సంగీత దర్శకుడు మార్చాడని పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశాడు.
తమిళనాడులో నాస్తిక ప్రభుత్వం ఈ పాటపై చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం నాస్తికుల పాలనలో ఉండటంతో సెన్సార్ బోర్డ్ అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. తమిళనాడు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని డిమాండ్ చేశాడు కిరణ్ రాయల్.