ఆంధ్ర ప్రదేశ్
కేరళ బృందంతో కలిసి డ్రమ్స్ వాయించిన హోం మంత్రి

ఏపీ హోం మంత్రి అనిత నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేరళ డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కేరళ కళాకారులతో కలిసి హోం మంత్రి అనిత డ్రమ్స్ వాయించారు. అనకాపల్లి జిల్లా ప్రజలతో పాటు, ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.



