సినిమా

‘శుభం’: USలో సమంతకు భారీ లాభాలు..!

Subham: స్టార్ బ్యూటీ సమంత నిర్మాతగా మారి ‘శుభం’ చిత్రంతో సక్సెస్ సాధించింది. హార్రర్ కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదిరే వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

సమంత రూత్ ప్రభు నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ హార్రర్ కామెడీ మే 9న విడుదలై ప్రేక్షకులను ఆకర్షించింది. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ ఘన విజయం సాధిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్‌లో 250K డాలర్స్‌కు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది.

హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, షాలినీ కొండెపూడి, వంశీధర్ గౌడ్ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ‘శుభం’ మరెన్ని విజయాలు అందుకుంటుందనేది ఆసక్తికరం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button