ఆంధ్ర ప్రదేశ్
Sajjala: చంద్రబాబును జనం ముందు దోషిగా నిల్చోబెడుతాం

Sajjala Ramakrishna Reddy : ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి సర్కార్ ప్రతిపక్షంపై విషం చిమ్ముతోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనంలో పలుచబడ్డ చంద్రబాబు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు తిరుమల లడ్డూ, పరకామణి కేసు, సిఐ హత్య కేసును వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అరాచకాలు అన్నింటిని బయటపెట్టి ప్రజల ముందు దోషిగా నిల్చోబెడుతామని సజ్జల స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాను లూఠీ చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడుతామని సజ్జల అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి కంటె ఎక్కువ సంతకాల సేకరణ జరిగేలా ప్రజా మద్దతు ఉందని సజ్జల తెలిపారు.



