ఆంధ్ర ప్రదేశ్
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు పరిపాలన అంతా డొల్లతనమే

Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలన అంతా డొల్లతనమేనని అన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు వికృత స్వరూపం జోగి రమేష్ అరెస్ట్‌తో బట్టబయలైందన్నారు. నకిలీ మద్యం కేసులో మాత్రం అరెస్ట్ చేయరా అని నిలదీశారు.



