ఆంధ్ర ప్రదేశ్

Sajjala: చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి

Sajjala: సీఎం చంద్రబాబు‌కు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని అన్నారు.

ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తామన్నారు. మంద బలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్‌ ఒకరు చాలు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడితేనే సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button