Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ హెల్త్ బులెటిన్ విడుదల

Saif Ali Khan: నటుడు సైఫ్ అలీఖాన్ హెల్త్ బులిటెన్ విడుదలైంది. సైఫ్ ఆరోగ్య పరిస్థితిని లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని చెప్పారు. సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసి వెన్నెముక నుంచి కత్తిని తొలగించినట్లు చెప్పారు. ఆయన ఎడమ చేయి, మెడపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
మరోవైపు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు గుర్తించారు. సైఫ్ అలీఖాన్ పక్కింటి సీసీ ఫుటేజ్‌లో దుండగుడిని ముంబై పోలీసులు గుర్తించారు. అలాగే సైఫ్ ఇంట్లో వేలిముద్రలను పోలీసులు సేకరించారు.
తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. దాడిలో సైల్ అలీఖాన్‌కు ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్ నివాసంలోనే ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారయ్యాడు.
ఘటనపై నటుడి టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నట్లు ప్రకటించారు. ఇది పోలీసు కేసుకు సంబంధించిన వ్యవహారం.. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తాం అని వెల్లడించింది. సైఫ్ అలీఖాన్ దాడి ఘటనపై హీరో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.