Mogli 2025: రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ నుంచి సంచలన అప్డేట్!

Mogli 2025: ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’తో మరోసారి సందడి చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ‘మోగ్లీ 2025’ చిత్రం సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ లవ్-యాక్షన్ థ్రిల్లర్‌లో రోషన్ రిస్కీ స్టంట్స్‌తో అదరగొట్టారు.
మారేడుమిల్లి అడవుల్లో 15 రోజుల పాటు చిత్రీకరించిన క్లైమాక్స్ సీన్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా పరిచయం కాగా, కాల భైరవ సంగీతం, రామ మారుతి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారాయి. ఈ నెలలో టీజర్ విడుదల కానుంది. 2025 చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.