తెలంగాణ
Roja: పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి.. మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్

Roja: మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేని బావిలో దూకి పోలీసులు చావాలన్నారు. దేశంలో అట్టడుగు స్థాయిలో ఏపీ పోలీసు శాఖ ఉందని ఏపీ పోలీస్ వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారని రోజా అన్నారు. పోలీసులు ఖాకీ చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇంతకు ఇంత తిరిగిస్తామని హెచ్చరించారు రోజా.



