ఆంధ్ర ప్రదేశ్
Roja: చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు

Roja: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారని రోజా మండిపడ్డారు. ఆంజనేయులు అరెస్ట్ డర్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కు నిదర్శనమని అన్నారు. తప్పు చేయని ఆంజనేయులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసును తొక్కి పెట్టారని అన్నారు.
స్కిల్ కేసును సీబీఐ విచారించాలని రోజా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు.అమరావతిలో అభివృద్ధి పనుల కోసం 36 వేల కోట్లకు టెండర్లు వేశారని ఇప్పుడు ఆ బడ్జెట్‌ను 76 వేల కోట్లకు ఎలా పెంచారో చెప్పాలని ధ్వజమెత్తారు.