ఆంధ్ర ప్రదేశ్
Roja: అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించడం లేదు

Roja: కూటమి పాలనపై మాజీమంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించడం లేదని ఆరోపించారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని నిప్పులు చెరిగారు.
నిరుద్యోగులకు 10లక్షల రూపాయిలు ఇచ్చి, ఉపాధి కల్పిస్తామని పవన్ కల్యాణ్ బూటకపు మాటలు చెప్పారని గుర్తుచేశారు. ఇక లోకేష్‌ను సీఎం చేయడానికి చంద్రబాబు ఎంతో తపన పడ్డారన్నారు రోజా.