తెలంగాణ
Rohith Reddy: నా కొన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటా

Rohith Reddy: తన కొన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోనే ఉంటానని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ సైనికుడిగా పని చేయడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లపై పైలట్ రోహిత్ ఘాటుగా స్పందించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకు తను పార్టీ మారుతున్నట్లు పుకార్లు లేపుతున్నారని అన్నారు.
తానే గువ్వల బాలరాజుని పంపినట్లు, మిగతా ఎమ్మెల్యేలను పంపిస్తానపి కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. తాండూరు ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తనపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు.



