Rohit Sharma: భారత క్రికెట్లో రోహిత్ శర్మ శకం ముగిసినట్లేనా..?
Rohit Sharma: టీమిండియా జట్టులో పించ్ హిట్టర్ రోహిత్ శర్మ.. శకం ముగిసినట్లేనా..? రోహిత్ బ్యాట్ పట్టడం ఇక కస్టమేనా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఘోరంగా రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యారు. సిడ్నీ టెస్టుతోనే సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో నిరాశపర్చిన రోహిత్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగే ఐదో టెస్టు తర్వాత టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని రోహిత్ డిసైడ్ అయినట్లు సమాచారం.
ఇక.. సిడ్నీ టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అయిదో టెస్టుకు రోహిత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌కు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే టాక్ నడుస్తోంది.