తెలంగాణ
ఎస్బీఐ ఏటీఎంలో చోరీ.. 13 లక్షల రూపాయల ఎత్తుకెళ్లిన దుండగులు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యలలో ఏటీఎంను ఎత్తుకెళ్లారు దుండగులు . రాత్రి వేళలో షిప్ట్ కారులో వచ్చిన నలుగురు దొంగలు చాకచక్యంగా వ్యవహరించి దోపిడికి పాల్పడ్డారు. ముందుగా సిసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మ్రోగకుండ సెన్సార్ వైర్లను కట్ చేశారు.
ఆ తర్వాత కట్టర్ ఇనుపరాడ్ల సహాయంతో ఏటిఎంను బద్దలు కొట్టి 4 నిమిషాల్లోనే తతంగం అంతా పూర్తి చేసి డబ్బుతో పారిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏటీఎంలో మొత్తం నగదు దాదాపు 30 లక్షల వరకు ఉందని ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ తెలిపారు.