ఆంధ్ర ప్రదేశ్
Anakapalli: రెండు తలల దూడ జననం

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో రెండు తలలతో దూడ జన్మించింది. చోడవరం పరిసర ప్రాంతాలలో మొదటి సారి ఇలాంటి దూడ పుట్టడంతో దేవుని స్వరూపం అంటూ గ్రామాల్లో ప్రచారం సాగుతుంది. దీంతో రెండు తలల దూడను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మళ్ల శ్రీను అనే రైతు ఆవులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
వాటిలో ఓ ఆవు ఈ రెండు తలలతో ఉన్న దూడకు ఆదివారం జన్మనిచ్చింది. ప్రస్తుతం లేగ దూడ ఆరోగ్యంగానే ఉందని రైతు శ్రీను తెలిపారు. ఇలాంటి దూడ పుట్టడం టీవీల్లో చూడటం తప్ప.. ఇలా తమ గ్రామంలోనే పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని గ్రామ సర్పంచ్ ప్రసాద్ అన్నారు.



