తెలంగాణ
Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి

Road Accident: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి హైవే 765పై ఘటన చోటుచేసుకుంది. మృతులు గౌస్, అలీ, అజీమ్ బేగంగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



