తెలంగాణ
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.